కోడి కత్తి శీనుకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని దళిత, గిరిజన, బీసీ సంఘాల నేతలు డిమాండ్ చేశారు. కోడి కత్తి శీనుకు న్యాయం చే యాలంటూ ఆదివారం పీలేరులో ఎమ్మార్పీఎస్ నాయకుడు సుధా కర్ నేతృత్వంలో దళిత, గిరిజన, బీసీ సంఘాల నేతలు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పీలే రులోని సీనియర్ న్యాయవాది చిన్నరెడ్డప్ప మాట్లాడుతూ కోడి కత్తి శీను వ్యవహారంలో రాజ్యాంగ, చట్టబద్ధంగా వ్యవహరించాల్సిన బాధ్యత ప్రభుత్వం, ప్రభుత్వాధినేతపై ఉంద న్నారు. మాలమహానాడు నాయకుడు గుర్రం నారాయణ, ఎమ్మార్పీఎస్ నాయకులు సుధా కర్, ముల్లంగి చంద్రయ్య, సీపీఐ నాయకుడు టీఎల్ వెంకటేశ, కాంగ్రెస్ పార్టీ నాయకుడు అమృతతేజ, రాష్ట్ర గిరిజన సమాఖ్య నాయకుడు కిల్లా విజయ్ కుమార్ మాట్లాడుతూ శీను దళితుడు అయినందు వల్లే అతనికి న్యాయం జరగడం లేదన్నారు. శీను ఉదంతంలో ఎటువంటి కుట్ర కోణం లేదని దేశ అత్యున్నత విచారణ సంస్థ అయిన ఎనఐఏ తేల్చి చెప్పినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. తనకు ఎస్సీలపై ఎంతో ప్రేమ అని చెప్పుకునే ముఖ్యమంత్రి జగన, శీను విషయంలో సమాధానం చెప్పా లన్నారు. అతనికి, అతని కుటుంబానికి న్యాయం జరిగే వరకు సంఘటితంగా పోరాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు సద్దల ప్రేమ్‌కుమార్, సాయిసంపత, అమృత పూరి అశోక్ సామ్రాట్, కొత్తకోట ప్రసాద్, తిమ్మయ్య, కుమార్, కొండయ్య, రవి, శేషాద్రి, రవితేజ, కార్తీక్, తదితరులు పాల్గొన్నారు.