సీఎం జగన్‌రెడ్డి విడిచిపెట్టినది మెగా డీఎస్సీ కాదని, దగా డీఎస్సీ అని టీడీపీ పొలెట్ బ్యూరో సభ్యుడు కిమిడి కళావెంకటరావు అన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో 50,892 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉంటే 6,100 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వడం నిరుద్యోగులను వంచించడమేనన్నారు. డీఎస్సీ పేరుతో యువతను మోసం చేయడానికి కొత్త నాటకం తెర తీశారన్నారు. ఇంతవరకూ జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన దాఖలు లేవని విమర్శించారు. ప్రతి టీడీపీ కార్యకర్త సైనికుల్లా పనిచేసి, వైసీపీ ప్రభుత్వం అరాచకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. కార్యక్రమంలో గొర్లె విజయ్‌కుమార్, ముప్పిడి సరేష్, గొర్లె సాయి, పిషని జగన్నాథంనాయుడు, కానకారావు, కొప్పిశెట్టి లక్ష్మణరావు తదితురులు పాల్గొన్నారు.