ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకువచ్చిన రైతు భరోసా కేంద్రాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని శ్రీశైలం ఎమ్మెల్యే, ఎథిక్స్ కమటీ చైర్మన్ శిల్పా చక్రపాణిరెడ్డి తెలిపారు. శ్రీశైలం నియోజకవర్గం ఆత్మకూరు మండలం వడ్ల రామాపురం గ్రామంలో నూతనంగా నిర్మించిన వైయస్ఆర్ రైతు భరోసా కేంద్రాన్ని ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడలేని విధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి రైతు సంక్షేమానికి వేల కోట్లు ఖర్చు చేస్తున్నారని తెలిపారు. ప్రతి గ్రామ పంచాయతీలో వైయస్ఆర్ రైతు భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేసి రైతులను చెయ్యి పట్టుకుని నడిపిస్తున్నారని చెప్పారు. ప్రతిపక్ష నాయకులు చెబుతున్న మోసపూరిత మాటలు నమ్మొద్దని, సీఎం వైయస్ జగన్ రైతులకు ఎన్నో ప్రత్యేకమైన పథకాలు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. మన ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి గర్వంగా చెప్పారు.