నేడు టీడీపీ, వైసీపీ సభ్యుల పోటాపోటీ నినాదాలతో అసెంబ్లీ దద్దరిల్లింది. టీడీపీ సభ్యులకు పోటీగా జై జగన్ అంటూ వైసీపీ సభ్యులు సైతం నినాదాలు చేశారు. వెంటనే బై బై జగన్ అంటూ టీడీపీ సభ్యులు నినాదాలు చేయగా.. ఒక్కసారిగా అసెంబ్లీలో వాతావరణం మారిపోయింది. దిశా చట్టం ఎక్కడ అంటూ టీడీపీ సభ్యులు కేకలు వేశారు. పేదలందరికీ ఇళ్లు అంతా బోగస్ అంటూ టీడీపీ సభ్యులు స్లోగన్లు వినిపించారు. పేదలందరికీ 10 రూపాయలు ఇస్తున్నారని.. రూ.100 రూపాయలు లాక్కొంటున్నారని టీడీపీ సభ్యులు ఆరోపించారు. టీడీపీ సభ్యులకు పోటీగా జై జగన్ అంటూ వైసీపీ సభ్యులు నినాదాలు చేశారు.