కేంద్ర ప్రభుత్వ సంస్థలు నిర్వహించే పరీక్షలో అక్రమార్కులను అడ్డుకునేందుకు వీలుగా పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) బిల్లు-2024ను కేంద్రమంత్రి జితేంద్రసింగ్ లోక్‌సభలో ప్రవేశపెట్టారు.
ఇది అమల్లోకి వస్తే పేపరు లీకేజీకి పాల్పడినా, మాల్ ప్రాక్టీస్ చేసినా, నకిలీ వెబ్‌సైట్లను సృష్టించినా మూడేళ్ల నుంచి ఐదేళ్ల జైలు శిక్ష, రూ.కోటి వరకూ జరిమానా పడనుంది.