ప్రధాని రిషి సునాక్ కుటుంబ సంస్థ కావడంవల్లే ఇన్ఫోసిస్‌కు ‘వీఐపీ ప్రవేశం’ దక్కుతోందని ప్రతిపక్ష లేబర్ పార్టీ ఆరోపించింది. గత ఏడాది ఏప్రిల్‌లో బెంగళూరులోని ఇన్ఫోసిస్ కేంద్రాన్ని వాణిజ్య మంత్రి లార్డ్ డొమినిక్ జాన్సన్ సందర్శించి..
ఆ సంస్థ బ్రిటన్‌లో ఎదగడానికి సహాయం చేస్తామని పేర్కొనడాన్ని తప్పుబట్టింది. అంతేకాకుండా వేలకోట్ల రూపాయల కాంట్రాక్టులను ఆ కంపెనీకి ఎలా అప్పగిస్తారని ప్రశ్నించింది.