ఆంధ్ర భద్రాద్రిగా పేరుగాంచిన ఒంటిమిట్ట కోదండ రామాలయమునకు ఎదురుగా ఉన్న సంజీవరాయనికి టిటిడి అధికారులు మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారు స్వామివారికి పట్టు వస్త్రాలు, గజ మాలలు సమర్పించారు. అర్చకులు స్వామి వారికి అభిషేకాలు నిర్వహించారు. స్వామివారిని సుందరంగా అలంకరించి దర్శనార్థం భక్తులను అనువదింప చేశారు. ఈ కార్యక్రమంలో టిటిడి అధికారులు, భక్తులు పాల్గొన్నారు.