దేశంలో యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ)ని అమలు చేసిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ అవతరిస్తుంది. యూసీసీ బిల్లును తీసుకురావడానికి ఉత్తరాఖండ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి.
ఈ బిల్లును నేడు రెండోవ రోజున అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలు చర్చల్లో పాల్గొనాలని ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి కోరారు.