ఆరోగ్యవంతమైన పిల్లల భవిష్యత్తుకోసం నులి పురుగులను నివారిద్దామని చిత్తూరు డీఆర్వో ఎన్. రాజశేఖర్ పిలుపునిచ్చారు. ఆయన మాట్లాడుతూ ఈనెల 9న నులిపురుగుల నివారణ దినోత్సవ కార్యక్రమాన్ని డీఎంహెచ్వో అనుబంధ శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని నిర్వహించాలన్నారు. నులి పురుగు నివారణ దినోత్సవ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈకార్యక్రమంలో డీఈవో విజయేంద్రరావు, సమగ్రశిక్ష ఏపీసీ వెంకటరమణారెడ్డి, డీఆర్డీఏ పీడీ తులసీ, డీపీవో లక్ష్మి, డీఎంహెచ్వో ప్రభావతి, జిల్లా ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ సుదర్శన్, సాంఘిక సంక్షేమశాఖ అధికారులు పాల్గొన్నారు.