ఇద్దరు మైనర్ కుమార్తెలపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తికి ఏకంగా 123 ఏళ్లు జైలు శిక్షను కేరళ కోర్టు విధించింది. అలాగే రూ.7 లక్షల జరిమానా విధించింది. పెద్ద కుమార్తెపై పదే పదే అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలి తరఫు న్యాయవాది తెలిపారు.
అలాగే చిన్న కుమార్తెతో కూడా అసభ్యంగా ప్రవర్తించారని, అప్పుడు నేరం బయటపడిందన్నారు. చిన్న కుమార్తె విషయాన్ని తల్లికి చెప్పడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసిందన్నారు.