అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. 2020 ఎన్నికల రద్దుకు ట్రంప్ ప్రయత్నించాడని ఆరోపణలు వస్తున్నాయి. దానిపై ఎలాంటి మినహాయింపు లేదని కొలంబియా డిస్ట్రిక్ యూఎస్ కోర్ట్ ఆఫ్ అపీల్ పేర్కొంది.
ఈ తీర్పుతో ట్రంప్‌పై నేర విచారణ ఖాయంగా కనిపిస్తోంది. కాగా, 2020 అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయాక ఎన్నికల ఫలితాలు తారుమారు చేసేందుకు ట్రంప్ కుట్ర పన్నాడనే ఆరోపణలు కూడా వచ్చాయి.