ప్రస్తుతం జైలులో ఉన్న ఆప్ నేత సంజయ్ సింగ్ వరుసగా రెండోసారి రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ఢిల్లీ కోర్టు మంగళవారం అనుమతించింది. రాస్ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి MK. నాగ్‌పాల్ విచారణ చేపట్టారు.
మద్యం కుంభకోణం ఆరోపణలపై గతేడాది అక్టోబర్‌లో సంజయ్‌సింగ్‌ను ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తొలిసారి ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసేందుకు సంజయ్ సింగ్ ఫిబ్రవరి 5న రాజ్యసభకు వెళ్లేందుకు కోర్టు అనుమతించింది.