కేంద్రప్రభుత్వ తీరుతో గత కొన్నేండ్లుగా కర్ణాటకకు రూ.62,098 కోట్ల పన్ను రాబడి నష్టం వాటిల్లిందని సీఎం సిద్ధరామయ్య ఆరోపించారు. ఢిల్లీ నిరసనలో ఆయన మాట్లాడుతూ..
రూ.5,485 కోట్ల ప్రత్యేక గ్రాంట్‌ను తిరస్కరించారని, రింగ్ రోడ్, వాటర్ బాడీలకు రావాల్సిన రూ.3 వేల కోట్లు నిలిపివేశారని చెప్పారు. రూ.17 వేల కోట్ల కరువు నిధులనూ ఆపేశారన్నారు. మొత్తం రూ.73,593 కోట్ల నిధులు నిలిచిపోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.