ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీఎం జగన్‌ నాకు, దేశానికి, ఎంతోమంది యువతకు ఆదర్శం: నిక్‌ వుజిసిక్‌ ప్రశంస

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 07, 2024, 07:44 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై ప్రముఖ మోటివేషనల్‌ స్పీకర్‌ నిక్‌ వుజిసిక్‌ ప్రశంసలు కురిపించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో యువతను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన.. సీఎం జగన్‌ తనతో పాటు ఎంతో మందికి ప్రేరణ అన్నారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి తనకు ఒక ఇన్‌స్పిరేషన్‌.. దేశంలోని యువతకు కూడా రోల్ మోడల్ అన్నారు. విద్యా రంగంలో ఏపీ సీఎం ఎన్నో సంస్కరణలు, విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారని పొగడ్తలు కురిపించారు.జగన్ తన విజన్‌తో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక వసతుల్ని ఏర్పాటు చేయడంతో పాటు ఆంగ్ల మాధ్యమాన్ని ప్రమోట్‌ చేశారన్నారు. అమ్మ ఒడిలాంటి పథకాలు విద్యార్థులకు ఎంతో మేలు చేస్తున్నాయన్నారు.


⁠యువత తలచుకుంటే ఏదైనా సాధించగలదని.. ప్రపంచాన్ని మార్చగల సత్తా, తెలివి తేటలు వారిలో ఉన్నాయన్నారు. 'మీ విజయాన్ని ఆస్వాదించండి. మీ హార్ట్, మీ మైండ్‌లోకి నెగిటివ్ వాయిస్ రానివ్వకండి. ఎప్పుడూ పాజిటివ్ ఆలోచనలతో ఉండండి. మీ కలలను నిజం చేసుకోండి. సహనం అనేది ఒక గొప్ప బలం. ఎన్ని ఓడి దుడుకులు వచ్చినా బలంగా ఉండాలి. ఆశ మాత్రం వదలకూడదు' అన్నారు. ఇండియాలో ఇకనుంచి ఐదు భాషలో వీడియో అందిస్తానని తెలిపారు. జీవిత లక్ష్యాన్ని తెలుసుకోవాలి. జీవితం విలువ గుర్తించాలి. జీవితంలో మనం జీవించాలి. సంపద పెంచుకోవడం కంటే ప్రేమను పంచడం ఎంతో విలువైన అంశం అంటూ యువతకు దిశానిర్దేశం చేశారు. విశ్వనగరంగా మారుతున్న విశాఖలో ఇటువంటి స్ఫూర్తిదాయక ప్రసంగం జరగడం ఇదే తొలిసారి. ఇంతటి మహత్తర కార్యక్రమానికి ఏయూ ఆతిథ్యం అందించి వేదికగా నిలిచింది.


తమ స్ఫూర్తిదాయక ప్రసంగాలతో నిక్‌ ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అయ్యారు. చేతులు,కాళ్లు లేకుండా జన్మించిన నిక్‌, తన తల్లిదండ్రులు అందించిన ప్రోత్సాహంతో ముందుకు సాగారు.. జీవితంలో ఒక్కోమెట్టు ఎక్కారు. తన జన్మకు ఒక లక్ష్యం ఉండాలన్న సంకల్పంతో ఎన్నో అవరోధాలు, అవమానాలు ఎదురైనా వెనక్కు తగ్గకుండా.. కాళ్లుచేతుల లేకపోయినా మెక్కవోని దీక్షతో ఈత కొట్టడం, సర్ఫింగ్‌ చేయడం, గోల్ఫ్‌ ఆడటం, నోటిలో పెన్ను పెట్టుకుని రాయడం, కాలి వేళ్లతో టైపింగ్‌ చేయడం వంటి విభిన్న సామర్ధ్యాలను అందిపుచ్చుకున్నారు. అంతేకాదు నిక్ ఒక మంచి వక్తగా కూడా పేరు తెచ్చుకున్నారు. నిరాశ, నిస్పృహతో కొట్టుమిట్టాడుతున్న యువతకు తన జీవితం ఒక స్ఫూర్తి, ప్రేరణ ఇచ్చేలా ముందుకు సాగుతున్్నారు. అన్ని అవయవాలు సక్రమంగా, ఎన్నో అవకాశాలు అందుబాటులో ఉన్నా క్షణికావేశంతో, చిన్నపాటి కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్న యువతకు నిక్‌ జీవితం ఒక ఆదర్శంగా నిలుస్తోంది. నిక్ ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మందిని తన ప్రసంగాలతో స్ఫూర్తిగా.. యువతలో మనోధైర్యాన్ని నింపుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com