రేషన్ షాపుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నాణ్యమైన నిత్యావసర వస్తువులను ప్రభుత్వ రేషన్ షాపుల ద్వారా ఆన్‌లైన్‌లో విక్రయించవచ్చా అన్న విషయంపై ప్రస్తుతం కేంద్రప్రభుత్వం ప్రయోగం చేస్తోంది.
రేషన్ షాప్‌ల నెట్‌వర్క్‌ను ఉపయోగించుకుని, కన్జ్యూమర్ ప్రొడక్ట్స్‌ను ఆన్‌లైన్ ఆర్డర్ల ద్వారా అందించే ప్రయోగాన్ని చేపట్టింది. హిమాచల్‌ప్రదేశ్‌లోని ఉనా, హమీర్‌పూర్ జిల్లాల్లో ఈ ప్రయోగం కొనసాగుతోంది.