పశ్చిమ బెంగాల్‌లోని జైళ్లలో కస్టడీలో ఉన్న మహిళా ఖైదీలు గర్భం దాల్చినట్లు తేలింది. అంతే కాకుండా జైళ్లలో కనీసం 196 మంది శిశువులు జన్మించారని గుర్తించింది. ఈ మేరకు కలకత్తా హైకోర్టు నియమించిన సహాయకుడు (అమికస్ క్యూరీ) సమాచారం అందించారు.
మహిళా ఖైదీల ఎన్‌క్లోజర్లలోకి మగ ఉద్యోగుల ప్రవేశాన్ని వెంటనే నిషేధించాలని కలకత్తా హైకోర్టును ఆయన కోరారు. ఈ అంశంపై సోమవారం విచారణ జరిగే అవకాశం ఉంది.