రాష్ట్రంలో ఎంతో అభివృద్ధి చేస్తున్నామంటూ గప్ఫాలు కొడుతున్న జగన్ ప్రభుత్వంపై టీడీపీ నేతలు విరుచుకుపడుతున్నారు. ఉన్నత చదువులు చదివినా కూడా ఉద్యోగాలు లేక టీకొట్టు పెట్టుకుని యువకులు జీవిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్ ప్రభుత్వంలో ఉద్యోగాలు లేక కోసిగి మండలంలో ఎమ్ కామ్, బీఈడీలు చదివిన వారు టీకొట్టు పెట్టుకొని జీవిస్తున్నారని మంత్రాలయం నియోజకవర్గం టీడీపీ ఇంచార్జీ తిక్కారెడ్డి అన్నారు. ఇదేనా జగన్ చేస్తున్న అభివృద్ధి అని మండిపడ్డారు. టీడీపీ అధికారంలోకి రాగానే రెండు లక్షల ఉద్యోగాలు... నిరుద్యోగులకు నెలకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని తిక్కారెడ్డి హామీ ఇచ్చారు.