బిహార్ సీఎం నితీశ్ కుమార్ ఇటీవల యూటర్న్ తీసుకొని మాజీ మిత్రపక్షమైన ఎన్డీఏలో చేరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాను అక్కడికి ఇక్కడికి వెళ్లనని, శాశ్వతంగా ఎన్డీఏతోనే ఉంటానని స్పష్టం చేశారు.
గురువారం ఢిల్లీలో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డాతో నితీశ్ కుమార్ సమావేశమయ్యారు. 2005 నుంచి బిహార్ అభివృద్ధి కోసం పనిచేస్తున్నామని అన్నారు.