అందితే జుట్టు అందకపోతే కాళ్ళు పట్టుకునే స్వభావం కల్గిన వ్యక్తి చంద్రబాబు అని మంత్రి మేరుగ నాగార్జున విమర్శించారు. బీజేపీతో పొత్తు కోసం అమిత్ షా కాళ్లు పట్టుకోవడం చంద్రబాబు దిగజారుడు తనానికి నిదర్శనమని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
మూడు పార్టీలు పొత్తులు పెట్టుకున్నా అభ్యర్ధులను ప్రకటించలేకపోయారని ఎద్దేవా చేశారు. 175 నియోజకవర్గాలలో గెలుపు కోసమే అభ్యర్థుల మార్పు అని పేర్కొన్నారు.