పచ్చ మీడియా కడుపు మంటతో రగిలిపోతోందని మంత్రి ఆర్కే రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామీణస్థాయి నుంచి యువతలో క్రీడా నైపుణ్యాలను వెలికి తీయడమే లక్ష్యంగా ప్రారంభించిన మెగా టోర్నీ ‘ఆడుదాం ఆంధ్రా’ రాష్ట్రస్థాయి పోటీలను శుక్రవారం విశాఖలో మంత్రి ఆర్కే రోజా ప్రారంభించారు. నాలుగు దశల్లో నిర్వహించిన క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్ పోటీలకు విశేష స్పందన రాగా.. జిల్లా స్థాయిలో సత్తా చాటిన జట్లతో రాష్ట్ర స్థాయి పోటీలను ఇవాళ్టి నుంచి ఈ నెల 13వ తేదీ వరకు ఫైనల్ పోటీలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మంత్రి రోజా మాట్లాడుతూ..ఆడుదాం ఆంధ్రా కిట్లపై సీఎం వైయస్ జగన్ ఫోటో వేస్తే తప్పేంటి? అని ప్రశ్నించారు. ఆంధ్రా దిష్టిబొమ్మ చంద్రబాబు ఫోటో వేయాలా? అని మంత్రి నిలదీశారు.