తమిళనాడులో ఎన్ఐఏ అధికారులు సోదాలు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 25 ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. శనివారం తెల్లవారుజాము నుంచే ఎన్ఐఏ సోదాలు చేస్తోంది.
చెన్నై, మధురై పట్టణాలతో సహా 25 ప్రాంతాల్లో దాడులు జరుగుతున్నాయి. ఎనిమిది మండలాల్లో ఎన్ఐఏ అధికారులు ఏకకాలంలో సోదాలు చేపట్టారు. కాగా, కొయంబత్తూరులో 2021 నాటి కారు బాంబు కేసుకు సంబంధించి ఈ సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.