అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ ప్రైమరీ ఎన్నికల్లో మరోసారి దూసుకెళ్లారు. మరో రాష్ట్రంలో విజయం సాధించి తన ఖాతాలో వేసుకున్నారు.
రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడటానికి ట్రంప్ అవకాశాలు మెరుగుపర్చుకుంటున్నారు. నెవడా రాష్ట్రంలో జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు.