కడపలో ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా సోదరుడి ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయని టీడీపీ కడప ఇన్ ఛార్జ్ మాధవిరెడ్డి మండిపడ్డారు. ఇదంతా పోలీసుల అండదండలతో దాడులకు జరుగుతున్నాయని తెలిపారు.
మహిళలని చూడకుండా అసభ్యకర పదజాలంతో దూషిస్తున్నారని ఆరోపిస్తున్నారు. టీడీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలే లక్ష్యంగా దాడులు, దౌర్జన్యాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.