రాష్ట్రంలో BJP జోరు పెంచుతోంది. పల్లెబాట పేరుతో రెండు రోజులపాటు గ్రామాల్లో ఇంటింటికీ తిరగాలని BJP రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. పల్లెకు పోదాం కార్యక్రమంలో భాగంగా BJP రాష్ట్ర అధ్యక్షురాలు
పురందేశ్వరి కృష్ణాజిల్లా గుడివాడ నియోజకవర్గం పరిధిలోని క్రోసూరు గ్రామంలో శని, ఆదివారాల్లో పర్యటించనున్నారు. ఇంటింటికి వెళ్లి సమస్యలను తెలుసుకోవడంతోపాటు కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరించి BJPకి అండగా ఉండాలని కోరనున్నారు.