ఆంధ్రప్రదేశ్ విభజనతో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటనేది తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ తెలుసు. విభజనకు కారణమైన కాంగ్రెస్ పార్టీ ఏపీలో ప్రజల ఆదరణ కోల్పోయింది. వైఎస్ షర్మిల రాకతో ఏపీలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం నమ్మకం మొదలైనట్టు కనిపిస్తోంది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసేందుకు ఆశావాహులు ఎగబడుతున్నారు.
ఇప్పటి వరకు 175 అసెంబ్లీ సెగ్మెంట్లలో పోటీ చేసేందుకు 793 మంది ఆశావాహులు దరఖాస్తు చేయగా, 25 పార్లమెంట్ స్థానాల్లో 105 అప్లికేషన్లు వచ్చాయి. దీంతో ఏపీలో కాంగ్రెస్ పార్టీకి ఇంత క్రేజ్ ఉందా అని ఏపీ ప్రజలు అనుకుంటున్నారు.