ఎనిమిది మంది ఎంపీలతో కలిసి భోజనం చేసిన పీఎం మోడీ తన వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు. ఆయన తనకున్న ఓ అలవాటు గురించి చెప్పారు. 'నేను ప్రతి రోజూ 3.5 గంటలు మాత్రమే నిద్రపోతా.
సాయంత్రం 6 గంటల తర్వాత ఎలాంటి ఆహారం తీసుకోను' అని మోడీ చెప్పినట్లు కేంద్రమంత్రి మురుగన్ తెలిపారు. బెడ్ పై పడుకున్న తర్వాత 30 సెకన్లలోనే గాఢ నిద్రలోకి జారుకుంటానని ప్రధాని మోడీ గతంలో చెప్పిన విషయం తెలిసిందే.