నగరి ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి రోజా దోపిడీని కూడా జబర్ద్‌స్తగా చేస్తున్నారని షర్మిల ఆరోపించారు. రాత్రికి రాత్రే కొండలు మాయమవుతున్నాయని, గ్రావెల్, మట్టి, ఇసుక, ఆఖరికి చిన్నచిన్న ఉద్యోగాల్లో సిఫారసులకు కమీషన్లు, హౌసింగ్ స్కీంలో రూ.కోట్ల స్కాం, వెంచర్లు వేయాలంటే రియల్టర్ల నుంచి కప్పం, సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలు, తహసీల్దార్ కార్యాలయాల నుంచి నెలవారీ ముడుపులు.... అంటూ మంత్రి రోజాపై అవినీతి ఆరోపణలు చేశారు. తనపై పిచ్చివాగుడు వాగితే తెలంగాణలో బీఆర్‌ఎస్ మంత్రులకు పట్టిన గతే రోజాకు కూడా పడుతుందనే విషయం గుర్తుపెట్టుకోవాలన్నారు.