ధర్మవరం పట్టణంలోని కొత్తపేటలో పదో తరగతి విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్ళితే.... కొత్తపేట కు చెందిన నజీర్బాషా, తస్లీం బాను దంపతుల రెండో కుమారుడు సల్మాన (14) స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి చదు వుతున్నాడు. అయితే ఆదివారం రాత్రి ఇంటిలో ఎవరూ లేని సమయంలో గదిలో ఉరి వేసుకున్నాడు. కొద్ది సేపటి తరువాత అతడి అన్న బాబా గది తలుపులు తెరచి చూ డగా సల్మాన ఉరికి వేలాడుతూ విగతజీవిగా కనిపించా డు. దీంతో బాబా గట్టిగా అరవడంతో చుట్టుప్రక్కల వారు వచ్చి సల్మాన మృతదేహాన్ని కిందకు దించారు. అనంత రం టూటౌన పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీశారు. అనంతరం కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించా రు. సల్మాన సరిగా చదువుకోలేదని తల్లిదండ్రులు మం దలించడంతో మనస్థాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డా డని స్థానికుల ద్వారా తెలుస్తోంది.