రజకుల అభ్యున్నతి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దామ చర్ల జనార్దన్ పేర్కొన్నారు. ఒంగోలులో ఆదివారం అయన మాట్లాడుతూ..... రజకులు ఎప్పుడు తమ పని తాము చేసుకుంటూ వారికి వచ్చే పదిరూపాయాలో బతికే వ్యక్తులన్నారు. ఇప్పటికి రజకులు అనేక ఇబ్బందుల్లో ఉన్నారనని చెప్పారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో రజకులను ఎస్సీల్లో చేర్చాలని చంద్రబాబు నాయుడు ప్రతి పాదనలు కూడా చేశారన్నారు. వారి సంక్షేమం కోసం దోబీఘాట్‌లతో పాటు పలు సంక్షేమ కా ర్యక్రమాలు అమలు చేసినట్లు చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబు పేద ప్రజల సంక్షేమం కోసం పని చేశారన్నారు. రాష్ట్రాన్ని అన్ని విధాలు గా ముందుకు తీసుకెళ్ళేందుకు ప్రయత్నాలు చేశా రని, కానీ రాష్ట్రంలో ఒక్క చాన్స్ పేరుతో అధికా రంలోకి వచ్చి జగన్‌రెడ్డి రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేశారని మండిపడ్డారు. జగన్ రూ.12 లక్షల కోట్లు అప్పు తెచ్చి ఏమి చేశారో ఎవరికీ తెలియని పరి స్థితి ఏర్పడిందన్నారు. రాష్ట్రంలో ఒక ఫ్యాక్టనిస్టు పాలన చేస్తున్నారని మండిపడ్డారు. జనసేన జి ల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ మాట్లాడుతూ ర జకుల అభివృద్ధి చెందాలంటే టీడీపీ, జనసేనతోనే సాధ్యమన్నారు. వైసీపీ ప్రభుత్వంలో అన్ని వ్య వస్థలను నిర్వీర్యం చేసి రాష్ట్రాన్ని దివాళా తీ యించారని మండిపడ్డారన్నారు. సంతనూతలపా డు మాజీ ఎమ్మెల్యే బీఎన్.విజయకుమార్ మా ట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో రజకుల తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు మంత్రి శ్రీనివాసరావు, పొదిలి శ్రీని వాసరావు, పలువురు రజక సంఘం నాయకులు పాల్గొన్నారు.