‘‘మరో రూ.8 లక్షల కోట్లు అప్పులు చేసేందుకా.. ఆంధ్ర రాష్ట్ర ప్రజలను బీజేపీకి బానిసలుగా మార్చేందుకా.... మీ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రత్యేక హోదాను బీజేపీకి తాకట్టు పెట్టినందుకా.... 25లక్షల ఇళ్లు అని చెప్పి ఒక్క ఇల్లూ నిర్మించనందుకా.... సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తరువాతే ఓట్లు అడుగుతానని మహిళలను ఏమార్చినందుకా.... 25వేల ఉద్యోగాలతో మెగా డీఎస్సీ అని ఎన్నికల ముందు 6వేల పోస్టులతో దగా డీఎస్సీ ప్రకటించినందుకా.. అధికారంలోకి వచ్చిన వారంలో ఓపీఎ్‌సను పునరుద్ధరిస్తానని ఉద్యోగులను నట్టేట ముంచినందుకా... దేనికి మీరు సిద్ధం అని ఊరూరా పోస్టర్లు వేసుకుంటున్నారు’’ అని సీఎం జగన్‌పై షర్మిల ప్రశ్నలు కురిపించారు.