గంగాధర్ నెల్లూరు మండలం నాసంపల్లిలో నూతనంగా నిర్మించిన రక్షిత మంచినీటి ట్యాంకును ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి చేతుల మీదుగా సోమవారం ప్రారంభించారు. స్థానిక సర్పంచ్ నీలావతి మాట్లాడుతూ గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమం వెళ్ళినప్పుడు మంచినీటి ట్యాంకు లేదని డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించి మంజూరు చేశారన్నారు. ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామికి గ్రామ ప్రజలు ధన్యవాదాలు తెలిపారు.