ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సీజన్ ఆశాజనకంగా ఉంటుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. వచ్చే జూన్ నుంచి సెప్టెంబరు వరకు గతేడాది సీజన్లో కంటే మెరుగైన వర్షాలు కురుస్తాయని విశ్లేషిస్తున్నారు.
పసిఫిక్ మహాసముద్రంలో జూన్ నాటికి ఎల్నినో బలహీనపడుతుందని, ఆగస్టు నాటికి లానినా ఏర్పడుతుందని నిపుణులు వివరించారు. దీంతో వచ్చే నైరుతిలో మంచి వర్షాలు కురుస్తాయని విశ్లేషించారు.