పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ నుంచి స్వతంత్ర డైరెక్టర్ మంజూ అగర్వాల్ రాజీనామా చేసినట్లు వస్తున్న వార్తలను పేటీఎం బ్రాండ్ మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్ ధ్రువీకరించింది.
వ్యక్తిగత కారణాల వల్ల ఫిబ్రవరి 1 నుంచి ఆయన వైదొలిగినట్లు పేర్కొంది. అంతకుముందు ఆర్బీఐ ఆంక్షల నేపథ్యంలోనే ఆయన బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.