లోక్సభ ఎన్నికలకు ముందే కాంగ్రెస్కు బిగ్ షాక్ తగిలింది. మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చౌహాన్.. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అయితే ఈ సీనియర్ నేత త్వరలో బీజేపీలో చేరనున్నట్లు కొన్ని వర్గాలు వెల్లడిస్తున్నాయి.
మహారాష్ట్రలోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు ఆ పార్టీని వీడుతున్నారు. ఈమధ్యే మాజీ కేంద్ర మంత్రి మిలింద్ డియోరా ఆ పార్టీని వదిలేశారు. ఆయన శివసేన పార్టీలో చేరిన విషయం తెలిసిందే.