శ్రీలంక, మారిషస్ దేశాల్లో భారత్ తన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) సేవలను సోమవారం ప్రారంభించింది. శ్రీలంకలో తొలి UPI లావాదేవీని ఓ భారతీయుడు చేశాడు.
ఇక ఈ కార్యక్రమానికి భారత ప్రధాని మోడీ, శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే, మారిషస్ ప్రధాని ప్రవింద్ జుగ్‌నాథ్ వర్చువల్‌గా హాజరయ్యారు. ఈ ప్రయోగం దేశాల మధ్య డిజిటల్ కనెక్టివిటీని మెరుగుపరుస్తుందని భారత విదేశీ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది.