ఏపీలో మహిళలకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. ఈ నెల 16న చిత్తూరు జిల్లా కుప్పంలో వైఎస్సార్ చేయూత పథకం కింద అకౌంట్లలో డబ్బుల్ని జమ చేయనున్నారు. ఆ రోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కార్యక్రమంలో పాల్గొని బటన్ నొక్కి డబ్బుల్ని విడుదల చేస్తారు.. అనంతరం జరిగే సభలో మాట్లాడతారు. వైఎస్సార్ చేయూత పథకం కింద ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన 45 నుంచి 60 ఏళ్ల లోపు మహిళలకు ప్రభుత్వం ఏటా రూ.18,750 అందిస్తోంది.
అలాగే ఈసారి ప్రభుత్వ పథకాలు, అకౌంట్లలో డబ్బులు జమ చేసే షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఫిబ్రవరి 16న కుప్పం నుండి వైయస్సార్ చేయూత విడుదల చేస్తారు. ఫిబ్రవరి 21న అన్నమయ్య జిల్లాలో రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ నిధులు విడుదల చేస్తారు. ఫిబ్రవరి 24 కర్నూలు నుంచి వైఎస్సార్ ఈబీసీ నేస్తం మూడో విడత నిధులు విడుదల చేస్తారు. ఫిబ్రవరి 27న గుంటూరులో విద్యా దీవెన 4th విడత నిధులు విడుదల చేస్తారు. మార్చి 5న సత్యసాయి జిల్లా నుంచి వసతి దీవెన రెండో విడత విడుదల చేస్తారు. వాలంటీర్లకు వందనం కార్యక్రమం షెడ్యూల్‌పై క్లారిటీ రావాల్సి ఉంది. ఈ నెలలో 3వ లేదా 4వ వారంలో ఉండే అవకాశం ఉంది.
వైఎస్సార్ చేయూత పథకం ద్వారా ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనారిటీ కులాల మహిళలకు ఆర్థిక ప్రయోజనం లభిస్తుంది. 45 నుంచి 60 ఏళ్లలోపు మహిళలకు నాలుగేళ్ల వ్యవధిలో రూ.75వేలు ప్రభుత్వం అందిస్తుంది. ఏడాదికి రూ.18,750ను లబ్ధిదారుడి బ్యాంకు ఖాతాల్లో బదిలీ చేస్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గానికి చెందిన 45 నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్సు గల మహిళలు అర్హులు. మొత్తం కుటుంబ ఆదాయం రూ. 10,000.. గ్రామీణ ప్రాంతాల్లో నెలకు రూ. పట్టణ ప్రాంతాల్లో నెలకు రూ.12,000. కుటుంబం మొత్తం భూమి 3 ఎకరాల తడి భూమి లేదా 10 ఎకరాల పొడి భూమి లేదా 10 ఎకరాల తడి, పొడి భూమి కలిపి మించకూడదు.
కుటుంబ సభ్యులెవరూ ప్రభుత్వ ఉద్యోగి, ప్రభుత్వ పెన్షనర్ కాకూడదు. కుటుంబానికి 4 వీలర్ (టాక్సీ, ఆటో, ట్రాక్టర్లు మినహాయింపు) ఉండకూడదు. కుటుంబ సభ్యులెవరూ ఆదాయపు పన్ను చెల్లించకూడదు. పట్టణ ప్రాంతంలో నిర్మాణపు స్టలము 1000 చదరపు అడుగులు కంటే తక్కువ ఉండాలి. అప్లికేషన్ కోసం అవసరమైన అడ్రస్ ప్రూఫ్, ఆధార్ కార్డు, కుల ధృవీకరణ పత్రం, నివాస ధృవీకరణ పత్రం, వయస్సు రుజువు, బ్యాంక్ ఖాతా పాస్‌బుక్, ఫోటో, మొబైల్ నెంబర్ కావాల్సి ఉంటుంది.
రాష్ట్రవ్యాప్తంగా వాలంటీర్స్ డోర్ టు డోర్ సర్వే ద్వారా లబ్ధిదారులను గుర్తిస్తారు. ఈ ప్రక్రియ ప్రభుత్వం నోటిఫై చేసిన డేట్ నుంచి మొదలవుతుంది. సాధారణంగా మే జూన్ జూలై నెలల్లో ఈ ప్రక్రియ కొనసాగుతుంది. వాలంటరీ తమ మొబైల్ అప్లికేషన్ ద్వారా లబ్ధిదారుల వివరాలను సేకరించి సచివాలయం వెల్ఫేర్ కి సమర్పిస్తారు. తర్వాత వాటిని నవశకం పోర్టల్ లో అప్ లోడ్ చేస్తారు.లబ్ధిదారుల వివరాలు సిక్స్ స్టెప్ validationలో పాస్ అయితే వారిని అర్హులుగా గుర్తించి డబ్బులు జమ చేస్తారు.