ప్రజలకు డిజిటల్ వైద్యసేవల కల్పనలో దేశంలోనే అగ్రస్థానంలో ఏపీ నిలుస్తోంది. పౌరులకు డిజిటల్ హెల్త్ అకౌంట్‌లు సృష్టించి, అందులో వారి ఆరోగ్య వివరాలను అప్‌లోడ్ చేయడం, భవిష్యత్‌లో వారు పొందే వైద్య వివరాలను డిజిటలైజ్ చేస్తున్నారు. మొత్తం జనాభాలో అత్యధికులకు హెల్త్ అకౌంట్‌లు సృష్టించడంతోపాటు ఆస్పత్రుల్లోనూ డిజిటల్ వై ద్యసేవల కల్పనలో ఏపీకి ఇప్పటికే జాతీయస్థాయిలో అనేక మొదటి బహుమతులు లభించాయి. డిజిటల్ వైద్య సేవల కల్పనలో ఇతర రాష్ట్రాలు సై తం ఏపీ విధానాలను అవలంభించాలని అన్ని రా ష్ట్రాలకు నేషనల్ హెల్త్ అథారిటీ సీఈవో లేఖ రాశారు.రాష్ట్రంలోని పౌరులకు టెలీ మెడిసిన్ సేవల కల్పనలో దేశంలో ఏపీ తొలి స్థానంలో నిలుస్తోంది. 2019 నుంచి దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి 20.41 కోట్లకు పైగా టెలీకన్సల్టేషన్లు నమోదు కాగా.. ఇందులో 25 శాతానికిపైగా టెలీకన్సల్టేషన్లు కేవలం ఏపీ నుంచే ఉంటున్నాయి.