వయసురీత్యా వచ్చే ఇబ్బందుల వల్ల అమెరికా అధ్యక్షుడు బైడెన్ జ్ఞాపకశక్తిలో అనేక లోపాలను గుర్తించినట్లు కీలక నివేదిక వెల్లడించింది.
ఈ తరుణంలో అమెరికా అధ్యక్షుడిగా బైడన్ దిగిపోవాల్సి వస్తే.. ఉపాధ్యక్ష పదవిలో ఉన్నకమలాహారిస్ ఆ బాధ్యత చేపడతారు. అధ్యక్ష బాధ్యతలు చేపట్టే విషయంలో ఆమె సామర్థ్యంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ అనుమానాలను తోసిపుచ్చుతూ.‘‘నేను అధ్యక్ష బాధ్యతలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాను’’అని కమలాహారిస్ తెలిపారు.