దేశ రాజధానిలో ‘ఢిల్లీ చలో’ పేరుతో భారీ స్థాయిలో ఆందోళన చేపట్టేందుకు రైతులు మార్చ్ మొదలుపెట్టారు. తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ పార్లమెంటు వరకు ట్రాక్టర్ ర్యాలీ చేపట్టేందుకు రైతులు పిలుపునిచ్చారు.
ఈ క్రమంలో సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేయడంతో భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. గాజీపుర్, చిల్లా సరిహద్దుల్లోని హైవేలపై కిలోమీటర్ల మేర వాహనాలు బారులుతీరాయి.