డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం ఆదివారపుపేటలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సాం ఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల విద్యార్థులు 52 మంది సోమవారం అస్వస్థతకు గుర య్యారు. అందులో 8 మందిని రామచంద్రపురం ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నా రు. కలుషిత ఆహారం తినడం కారణంగా విద్యార్థు లు అస్వస్థతకు గురయ్యారని ప్రాథమికంగా నిర్థా రించారు. ఈ గురుకుల పాఠశాలలో 450 మంది వరకు విద్యార్థులు ఉన్నారు. వారిలో కొంతమందికి ఆదివారం రాత్రి వాంతులు, రక్త విరోచనాలు అయ్యాయి. గురుకుల పాఠశాల ఆరోగ్య పర్యవేక్షకుడు విద్యార్థులకు ప్రాథమిక వైద్యం అందించా డు. సోమవారం ఉదయం నాటికి అస్వస్థతకు గురై న వారి సంఖ్య 52కు చేరుకుంది. అందులో కొంతమందికి వాంతులతోపాటు రక్త విరోచనాలు అయ్యా యి. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ దుర్గారావుదొర పాఠశాలను సందర్శించి విద్యార్థులకు వైద్య అందుతున్న తీరును పరిశీలించారు.