కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిరుద్యోగులను, రైతులకు తీరని అన్యాయం చేసిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తామని, రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పిన మోదీ.. మోసగించారని అన్నారు. రాష్ట్రంలో 40 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉంటే సీఎం జగన కేవలం 6,100 పోస్టులతో డీఎస్సీ ప్రకటించడం దారుణమని అన్నారు. వెంటనే 23 వేల పోస్టులతో డీఎస్సీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏపీ ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు, కడప స్టీల్ ఫ్యాక్టరీ.. ఇలా అనేక హామీలు అమలుకు నోచుకోలేదని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు. ఐఏఎ్‌సలు, ఐపీఎ్‌సలను ఉపయోగించి వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఓట్లను గల్లంతు చేయిస్తోందని ఆరోపించారు. పార్టీ యంత్రాంగాన్ని, ప్రభుత్వాన్ని కాళ్ల కింద తొక్కిపట్టి జగన పరిపాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. దొంగ ఓట్ల చేర్పు, మంచి ఓట్ల తొలగింపులో విషయంలో ఎన్నికల కమిషన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.