పెనుకొండ నియోజకవర్గం పరిగి మండలం ధనాపురం ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థిని నిఖిల ఇటీవల జరిగిన జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో ప్రతిభ కనపరచి రాష్ట్ర స్థాయి ఇన్స్పైర్కు ఎంపికైనట్లు పాఠశాల హెచ్ ఎం జ్యోతిర్మయి మంగళవారం తెలిపారు. ఈ సందర్బంగా విద్యార్థినికి గైడ్ టీచర్ గా ఎన్. సుకన్య వ్యవహరించారు. చిత్తూరులో నిర్వహించే రాష్ట్ర స్థాయి ప్రదర్శనలో ఈ విద్యార్థిని పాల్గొంటుందని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa