యూఏఈలో పర్యటిస్తున్న ప్రధాని మోదీ.. అబుదాబిలోని ‘అహ్లాన్ మోదీ’ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. యూఏఈ భారత్కు మూడో అతిపెద్ద భాగస్వామి అని చెప్పారు.
ప్రస్తుతం భారత్ అన్ని దేశాలకు మంచి మిత్రదేశమన్నారు. యూఏఈ అత్యున్నత పురస్కారం ‘ది ఆర్డర్ ఆఫ్ జాయేద్’ అందుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ అవార్డు భారతీయులందరిదని చెప్పారు.