ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న విమానయాన సంస్థ గోఫస్ట్కి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్లో కొంత ఊరట లభించింది. కంపెనీ దివాలా పరిష్కార ప్రక్రియను ముగించేందుకు గడువును ఎన్సీఎల్టీ మరో 60 రోజుల పాటు పెంచింది.
పరిష్కార నిపుణుడు దివాకర్ మహేశ్వరి విజ్ఞప్తి మేరకు ఈనిర్ణయం తీసుకుంది. గోఫస్ట్పై 3 సంస్థలు ఆసక్తి వ్యక్తం చేసినట్లు, ధరావత్తును కూడా డిపాజిట్ చేసినట్లు మహేశ్వరి తెలిపారు.