కాంగ్రెస్ కమిటీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వంపై తొమ్మిది ప్రశ్నలు సంధించారు. డీఎస్సీ అభ్యర్థులకు సమాధానం చెప్పాలని షర్మిల డిమాండ్ చేశారు.
రెండు రోజుల క్రితం విడుదల చేసింది మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ అని ఆరోపించారు. గతంలో తన తండ్రి వైఎస్సార్ 52 వేల పోస్టులతో మెగా డీఎస్సీ వేస్తే జగన్ ప్రభుత్వం 6 వేల పోస్టులతో వేసిందని విమర్శించారు.