ప్రయాణికుల వాహన రిటైల్ విక్రయాలు జనవరిలో రికార్డు గరిష్ఠానికి చేరినట్లు వాహన డీలర్ల సమాఖ్య ఫాడా తెలిపింది. ఎస్యూవీలకు భారీ గిరాకీ నమోదైనట్లు పేర్కొంది.
క్రితం ఏడాది తొలి నెలలో 3,47,086 యూనిట్ల పీవీలు అమ్ముడయ్యాయి. ఈసారి అవి 13 శాతం పెరిగి 3,93,250కి చేరాయి. కొత్త మోడళ్ల ప్రవేశం, వివిధ రకాల పథకాలు, పెళ్లిళ్ల సీజన్ కలిసొచ్చినట్లు వివరించింది.