తెలంగాణ అసెంబ్లీలో చర్చ వింటే ఏపీ అభివృద్ధి ఏ స్థాయిలో జరిగిందో తెలుస్తుందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఏపీ రైతులకు జరిగిన మేలు తెలంగాణ అసెంబ్లీలో మంత్రులే చెబుతున్నారని పేర్కొన్నారు. మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంత నీరు నిలబెట్టారో, సీఎం వైయస్ జగన్ దానికి రెట్టింపు నిలబెట్టారని తెలిపారు. టీడీపీ పతనావస్థకు చేరింది… ఇది ప్రారంభం మాత్రమేనని అన్నారు. టీడీపీ ఏమి చేసింది అని చెప్పుకునే పరిస్థితిలో కూడా లేదని దుయ్యబట్టారు. ఈనెల 18న రాప్తాడులో రాయలసీమ జిల్లాల ‘సిద్ధం’ సభ నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. ఈ సభకు భారీగా పార్టీ క్యాడర్, నాయకులు హాజరవుతారని చెప్పారు. ఎన్నికలకు ఇది శంఖారావం.. ఇప్పటికే భీమిలి, ఏలూరులో సభ విజయవంతంగా నిర్వహించామన్నారు. ఎన్నికలకు సంబంధించి పార్టీ నాయకులకు సీఎం వైయస్ జగన్ దిశానిర్దేశం చేస్తారని చెప్పారు.