కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ రాజస్థాన్‌లోని జైపూర్‌కు చేరుకున్నారు. రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు ఢిల్లీలోని తన నివాసం నుంచి బయల్దేరారు.
ఉదయం 11 గంటలకు అసెంబ్లీలో నామపత్రాలు సమర్పిస్తారు. 1999 నుంచి ఐదుసార్లు లోక్‌సభ సభ్యురాలిగా ఆమె ఉన్నారు. మరోవైపు గాంధీ కుటుంబం నుంచి ఇందిరా గాంధీ తర్వాత రాజ్యసభలో అడుగుపెట్టబోయే రెండో వ్యక్తిగా ఆమె నిలవనున్నారు.