ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీని చంద్రబాబు కబ్జా చేస్తే.. రాష్ట్రంలోని విలువైన భూమల్ని రామోజీరావు కబ్జా చేశారని, కబ్జాల్లో చంద్రబాబు, రామోజీరావు ఇద్దరూ దొందు దొందే అని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి అన్నారు. టీడీపీ అంటేనే తెలుగు దొంగల పార్టీ, తెలుగు దోపిడీ పార్టీ అని ధ్వజమెత్తారు. ఆమె మాట్లాడుతూ.... గౌరవ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ఆంధ్రరాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతగా కష్టపడుతున్నారనేది అందరికీ తెలుసు. ప్రధానంగా విశాఖపట్టణాన్ని ఒక అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చేయడానికి ఎంతగానో కృషిచేస్తున్నారు కనుకే ఉత్తరాంధ్ర ప్రజలు వైయస్ జగన్‌కి నీరాజనం పడుతోన్నారు. దానికి ఉదాహరణే మొన్న జరిగిన ‘సిద్ధం’ సభను చెప్పుకోవచ్చు. జనం తండోపతండాలుగా వచ్చి జగనన్నకు తమ మద్ధతు తెలియజేసి వారి పట్ల అభిమానాన్ని తెలియజేశారు. 2024 వన్స్‌మోర్ అని ఉత్తరాంధ్ర ప్రజలు డిసైడై ఉన్నారు అని అన్నారు.