ఎన్నికల్లో గుంటూరు క్లీన్ స్వీప్ వైయస్ఆర్ సీపీ లక్ష్యమని గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ నాయకులతో రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో గుంటూరు పార్లమెంట్ స్థానంతో పాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు గెలుపే లక్ష్యంగా పని చేయాలని పార్టీ నాయకులకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు. గుంటూరు పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు, నియోజకవర్గ సమన్వయకర్తలు, పరిశీలకులతో గుంటూరు పార్టీ ప్రాంతీయ కార్యాలయంలో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో విజయసాయిరెడ్డి మాట్లాడుతూ..గుంటూరు, నర్సరావుపేట, బాపట్ల నియోజకవర్గాల పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ గా నన్ను నియమించిన ముఖ్యమంత్రిగారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజెస్తున్నానని చెప్పారు. జగన్ గారు నాలుగున్నరేళ్లకు పైగా సాగించిన పాలనలో ప్రజల సంక్షేమమే పరమావదిగా విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి..ప్రజల గుండెల్లో నిలిచిపోయారని అన్నారు..దీన్ని మనం ఎన్నికల్లో అనుకూ అస్త్రంగా ఉపయోగించుకోవాలని అన్నారు..పార్లమెంటు, అసెంబ్లీ అభ్యుర్ధుల ఎంపిక విషయంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ గారు సామాజిక న్యాయం పాటించారని అన్నారు..నియోజకవర్గాలలో ఇంచార్జీలను మార్పు చేసి, కొత్తవారికి అవకాశాలు ఇస్తున్నారని అన్నారు..పార్టీ పెట్టినప్పటి నుండి,2014లో ఓటమి తరువాత ప్రతి పక్షపార్టీల నుండి అనేక దాడులను ఎదుర్కొన్నామని అన్నారు. ఈ పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజక వర్గాలలో గెలుపు కోసం ప్రణాళికతో ముందుకెళ్ధామని పిలుపునిచ్చారు..గెలుపు కోసం పార్టీ కార్యకర్తలను కలుపుకొని వారిలో అభద్రతా భావం లేకుండా భరోసా కల్పించాల్సిన బాధ్యత పార్టీ ఎమ్మెల్యేలు,సమన్వయకర్తల మీద ఉందన్నారు..ఉద్యోగులు,ఎన్జీవోలు..ఏ వర్గాన్ని వదలకుండా అందర్ని కలుపుకు పోవాలన్నారు..పార్టీ కమీటిలను త్వరగా పూర్తి చేయాలన్నారు..గత ఎన్నికల్లో గెలుపుకు పార్టీ బూత్ కమిటిలు కీలకంగా వ్యవహరించాయన్నారు.